వెల్గటూర్ సహకార సంఘం వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎం.పీ.పీ కనమాల్ల లక్ష్మీ లింగయ్య

Published: Saturday April 24, 2021
వెల్గటూర్, ఏప్రిల్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రములు గొడిశెలపేట. చేగ్యం, ముత్తునురు, మొక్కట్రవుపేట్, కోటిలింగాల వరి కొనుగోలు కేంద్రాలను శుక్రవారం రోజు ఎం.పి.పి కనుమల్ల లక్ష్మి లింగయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఎలెటి కృష్ణారెడ్డి, వెల్గటూరు సహకార సంఘం అధ్యక్షులు శ్రీ గోలి రత్నాకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు  వన్నెల నర్సింహ రెడ్డి, ముత్తు నగర్ గ్రామ సర్పంచ్ అనుమల తిరుపతి, ఎం.పి.టి.సి అనుమల మంజుల, సహకార సంఘం డైరెక్టర్లు సింగం రమేష్, బైరం లక్ష్మి, ఎండపల్లి సింగిల్ విండో అధ్యక్షులు గూడ రామ్ రెడ్డి, ఏ.పీ.ఎం చంద్రకళ, ఎ.ఆర్ నాగ సంకీర్త్, ఎం.పి.టి..సి, ఎ.ఈ.ఒ. మహిళా సంఘ సభ్యులు మరియు సర్పంచులు మహిళలు, రైతులు మరియు సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.