*కనీస వేతనం 21వేలు చెల్లించాలి.*

Published: Saturday December 17, 2022
మంచిర్యాల టౌన్, డిసెంబర్ 16, ప్రజాపాలన: కనీస వేతనం రూ.21 వేలు చెల్లించాలని ఆశ వర్కర్స్ యూనియన్  రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు వంట వార్పులో భాగంగా బతుకమ్మ ఆట పాటల అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం  అందజేశారు. ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  చేపట్టే అన్ని సర్వేలు ఆశా వర్కర్లు లతో చేపిస్తు, సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వం  వెంటనే స్పందించి కనీస వేతనం 21వేలు చెల్లించి, పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యెడల పలు ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి సంకె రవి, సమ్మక్క, శోభ ఆశ జూనియర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయలక్ష్మి, లీలా జిల్లా ఉపాధ్యక్షురాలు, రాణి, కవిత భాగ్య జిల్లా కమిటీ సభ్యులు, సునీత, మమత తదితరులు పాల్గొన్నారు.