తెలంగాణా పోరాటంలో అసువులు బాసిన అమరుల త్యాగలు వృధాకనీయం బెజవాడ రవి

Published: Monday September 13, 2021
మధిర, సెప్టెంబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణా పోరాట వారోత్సవాలలో భాగంగా ఈరోజు మడుపల్లిలో సాయుధ పోరాటంలో పాల్గొన్న యలమద్ది వెంకయ్య, ఊట్ల సాంబయ్య గార్ల స్థూపం వద్ద ఉన్నటువంటి పార్టీ పతాకాన్ని సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవి ఆవిష్కరించారు. వెంకయ్యగారి స్థూపనికి వారికుమారుడు యలమద్ది రాము, ఊట్ల సాంబయ్య గారి కుమారుడు కామేశ్వర్రావు, సిపిఐ మండల కార్యదర్శి ఊట్లకొండలరావు, పూలమాలవేసి ఘనంగా నివాళులార్పించారు. ఈ సందర్బంగా బెజవాడ రవి మాట్లాడుతూ సాయుధ తెలంగాణా పోరాటం చారిత్రక పోరాటం అని అణచివేతకు, దుర్మార్గానికి వ్యతిరేకంగా సాగిన మహోజ్వల పోరాటమని అన్నారు. నిజాం నిరంకుశంత్వానికి, రాజాకార్ల దుర్మార్గానికి ఎదురొడ్డి నిలిచిన అమరవీరుల త్యాగలు వృధాకానీయమని, వారు చూపిన పోరుబాటలోనే మనమందరం ఈనాడు నయా గడీల పాలనకు చేరమగీతం పాడేందుకు సిద్ధంగా వుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయకార్యదర్శి చావా మురళి, పెరుమాళ్ళపల్లి ప్రకాశరావు, aisf జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, అన్నవరపు సత్యనారాయణ మందడపు అప్పారావు, పంగా శేషగిరి, నాగకృష్ణ, బ్రమ్మం, sk కొండా, రామానుజం, మొదలగువారు పాల్గొని అమరవీరులకు నివాళులార్పించారు.