రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ తల్లి భోనాలు

Published: Monday June 27, 2022
జన్నారం రూరల్, జున్ 26, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా  జన్నారం మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి భోనాలు అంగారంగవైబవంగా జరిగాయి, అదివారం రోజున మండల కేంద్రంలో పోన్కల్ జన్నారం రజక సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి భోనాలు నిర్వహించారు, ఈ సందర్భంగా మండల కేంద్రంలోని రజక సంఘం సభ్యులు నియమయిష్టలతో స్థానిక పోచమ్మ తల్లి నిలయం వరకు  డప్పులు గజ్జెలు నడుమ అందరు కలిసి ఆటపాటలతో అమ్మవారి గుడి వరకు బోనాలతో వెళ్లారు, ఈ కార్యాక్రమంలో రజక సంఘం సభ్యులు పెద్ద మెుత్తంలో పాల్గొన్నారు.