కోవిద్ పాజిటివ్ వచ్చిన వారికి అండగా ప్రజా వైద్యశాల

Published: Tuesday May 18, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి 17 వ తేదీ మధిర ప్రాంతంలో ప్రజా వైద్యశాల అనేది ఒక చరిత్ర ఎందుకంటే నిన్న, మొన్న కాదు గత 50 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ అది అందులోనూ వైద్య రంగంలో వైద్య రంగంలో డాక్టర్స్ అనగానే మధిర ప్రాంతంలో అందరికి గుర్తుకు వచ్చే మొదటి వారు అయిన మరియు ఎంతో కాలం గా మధిరలో ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్న అనుభవజ్ఞులైన డా.వాసిరెడ్డి రామనాధం గారు స్థాపించిన ప్రజా వైద్యశాలలో వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన ప్రముఖ వైద్యులు డా.వాసిరెడ్డి సతీష్ గారు కరోనా పాజిటివ్ వచ్చిన వారి కోసం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తో తమ హాస్పిటల్ నందు కోవిద్ ఐసోలేషన్ సెంటర్ మరియు అత్యవసరం అయిన వారి కోసం ఆక్సిజన్ బెడ్స్ కూడా ఏర్పాటు చేసి పాజిటివ్ వచ్చిన వారికి వైద్యం తో పాటుగా మనోధైర్యం కల్పిస్తూ వారి ప్రాణాలను కాపాడుతూ అండగా ఉంటున్నారు ప్రజా వైద్యశాల కు పేదల హాస్పిటల్ అని కూడా పేరు ఎందుకంటే దానిని స్థాపించిన గౌరవ పెద్దలు డా.వాసిరెడ్డి రామనాధం గారు ఎంతో మంది పేద వారికి ఉచితంగా మరియు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించారు అనేది అందరికి తెలిసిందే... ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమకి ఎందుకులే అనుకోకుండా ఈ ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హాస్పిటల్ లో అడ్మిట్ అయిన కోవిద్ పాజిటివ్ ఉన్న వాళ్లకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నా డా.వాసిరెడ్డి సతీష్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.