ప్రభుత్వం ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవాలి. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ. బూర్గంపాడు మండలం( ప్రజా

Published: Tuesday October 18, 2022
మెట్ట ప్రాంతంలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని,
గత మూడు నెలల కిందట గోదావరి ముంపుకి గురైనటువంటి ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్  ఇచ్చిన హామీ మేరకు మెట్ట ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం చేపట్టి హామీని నిలబెట్టుకోవాలని సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోరా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బూర్గంపాడు మండలం సారపాక లో  ఐ ఎఫ్ టి యు మణుగూరు  ఏరియా కమిటీ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన గోదావరి వరద బాధితుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. గోదావరి వరదలకు వివిధ కాలనీల్లో నివాసాలు మొత్తం నిండా మునిగిపోయి సామాన్లు కొట్టుకుపోయి తీవ్ర నష్టం జరిగి ప్రజలు కట్టుబట్టలతో బయటపడి నిరశ్రయలుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి ముంపు ఏరియల్ సర్వే కి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముంపు బాధితులకి మెట్ట ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.  ఈ సమస్య పరిష్కారం కై బూర్గంపాడు మండలంలో ప్రజలు  రాజకీయాలకు అతీతంగా గత 65 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా కనీసం అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోకపోవడం వరద బాధితుల పట్ల నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు.
ప్రైవేట్ కంపెనీలకు వ్యక్తులకు విచ్చలవిడిగా భూములు ధారధక్తం చేస్తున్న ప్రభుత్వం, నిండా మునిగి ఉంటానికి ఇల్లు లేకుండా ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వడానికి ప్రభుత్వ పెద్దలకు మనసు రావడం లేదని ఆయన అన్నారు.  తక్షణమే ప్రభుత్వం  స్పందించి బూర్గంపాడు మండల గోదావరి ముంపు ప్రాంత ప్రజల సమస్యను  పరిష్కరించి , ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, గోదావరి ముంపు బాధితులకి న్యాయం చేయాలని, లేనిపక్షంలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సమస్య పరిష్కారం కోసం ఆందోళన ఉదృతం చేయాల్సి వస్తుందని  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కుంజ కృష్ణ, ఐ ఎఫ్ టి యు మణుగూరు ఏరియా కమిటీ నాయకులు వైఎస్ రెడ్డి,  పి డి ఎస్ యు జిల్లా నాయకులు రామకృష్ణ, రాములు, రవి ,ఆర్.లక్ష్మి , అనంత అనంతలక్ష్మి, వహీద్ పాషా, రఫీ,మురళి,వర్శ.రమాదేవి, జ్యోతి, ముంతాజ్, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.