తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం

Published: Thursday August 04, 2022
జన్నారం, ఆగస్టు ౦3, ప్రజాపాలన:  మండలంలోని పోన్కల్- 3, దర్మారం అంగన్ వాడి కేంద్రాలలో తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని తల్లిపాలు వారోత్సవాల ర్యాలీ నిర్వహించారు, బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అంగన్ వాడి ఐసీడీఎస్ సూపర్ వైజర్ ఎ రాజేశ్వరి, సూపర్ వైజర్, రాజ్యలక్ష్మీ మాట్లాడుతూ తల్లిపాలు కంటే శ్రేష్ఠమైనవి ఎవి లేవని ఈ విషయము తల్లులు గ్రహించాలి. తల్లిపాల ప్రాముఖ్యత పుట్టిన గంట లోపు ముర్రుపాలు ఇవ్వాలని తల్లులకు వివరించడం జరిగింది. యాడది పిల్లల వరకు వల్ల కలిగే ప్రయోజనాలనపై అవగాహన కల్పించారు. తల్లి బిడ్డల మద్య  అనుబంధాన్ని పెంచేది తల్లిపాలు ఒకటేని, బిడ్డ పుట్టిన మెుదటి అరు నెలల వరకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలి. కూరగాయల పండ్లు పప్పు ధాన్యాలు ప్రోటీన్ వంటివి పిల్లలకు చాలా మంచివి వాటితోపాటు తల్లిపాలు శిశువుకు సమతౌల్యం పోషకాలు అందిస్తాయని అన్నారు, ఈ సందర్భంగా సోమవారం నుంచి ఆగస్టు ఎడవా తేది వరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమయ్యే తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేసారు. తల్లిపాలతో బిడ్డకు ఎన్నో ప్రయెాజనాలు ఉన్నాయి. ఈ కార్యాక్రమంలో 
పోన్కల్ సర్పంచ్ జక్కు భూమేష్, దర్మారం ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్,  ఎఎన్ఎమ్ అరుణ, అంగన్ వాడి టీచర్లు, తల్లులు, ఆశాలు,అయాలు, పాల్గొన్నారు.
 
 
 
Attachments area