ఘనంగా జువ్వాడి నర్సింగరావు జన్మదిన వేడుకలు

Published: Tuesday July 05, 2022
కోరుట్ల, జూలై 04 ( ప్రజాపాలన ప్రతినిధి ):
తెలంగాణ  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  యువ నాయకులు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి  జువ్వాడి  నర్సింగరావు  జన్మదిన వేడుకలు కోరుట్ల పట్టణ  మండల కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో కల్లూరు రోడ్ లోని  ప్రాథమిక పాఠశాలలో చిన్నారి విద్యార్థుల మధ్యలో జన్మదిన వేడుకలు  ఘనంగా నిర్వహించారు. స్కూల్ లో ఉన్న విద్యార్థులందరికీ నోటుబుక్స్ పెన్స్ మరియు కేక్ కట్ చేసి పంపిణి చేశారు. ఈ సందర్భంగా కొంతం రాజం, తిరుమల గంగాధర్ లు కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు సంయుక్తంగా మాట్లాడుతూ  తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు, చిన్నప్పటి నుండి రాజకీయల  లో ఆసక్తి ఉన్న యువ నాయకులు. నియోజకవర్గం లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూన్నారని కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థిగా  నర్సింగరావు ను భారీ మెజారిటీతో  శాసన సభ్యులు గా గెలిపించుకుంటామని అన్నారు.