రాజనగర్ లో గ్రంథాలయం ప్రారంభం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Thursday February 25, 2021
రాయికల్, ఫిబ్రవరి 24(ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం రాజనగర్ గ్రామంలో పుస్తకాల బండి గ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తితో ఏర్పాటుచేసిన గ్రంధాలయాన్ని జగిత్యాల శాసనసభ్యులు బుధవారం సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పుస్తక పఠనం తగ్గి సాంకేతిక పరిజ్ఞానంఠీ యువత మొగ్గు చూపుతోందని చరవాణితో ఎక్కువ సేపు యువతరం గడుపుతుందని అన్నారు. మరల పుస్తకాలలో యువతరం పూర్తి పేరు నవరత్న ఫ్రెండ్స్ అసోసియేషన్ అనేక కష్టనష్టాలకోర్చి గ్రంథాలయం ప్రారంభించడం ప్రశంసనీయమని అన్నారు.సాంకేతిక పరిజ్ఞానం ను కూడా సక్రమ మార్గంలో వాడుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నవరత్న ఫ్రెండ్స్ అసోసియేషన్ మరియు పుస్తకాల బండి వ్యవస్థాపకుడు సేవ్ లైబ్రరీ సేవ్ సొసైటీ ఉద్యమకారుడు వాసాల లక్ష్మీనారాయణను శాలువా కప్పి ప్రత్యేకంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణి, జడ్పిటిసి అశ్విని జాదవ్, ఎం.పి.టి.సి సోమిరెడ్డి సురేందర్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ బురి రాజేందర్, నవరత్న ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు బలుసు రంజిత్, భారతపు రాజు, చల్ల సతీష్, భారతపు శేఖర్, బత్తిని రాజశేఖర్, చెట్లపెల్లి రాజు, మిట్టపెల్లి శ్రీనివాస్, సుతారి గంగాధర్, మ్యాకల రాజేందర్ మరియు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.