మూడు మండలాల రైతు శిక్షణ తరగతులుప్రకృతి వ్యవసాయ రైతు కుడుముల వెంకటరామిరెడ్డి రైతులకు శిక్షణ

Published: Thursday December 09, 2021
మధిర డిసెంబర్ 8 ప్రజాపాలన ప్రతినిధి : మధిర లోని రైతు వేదిక నందు బుధవారం మధిర ఎర్రుపాలెం బోనకల్ మండలాల కు చెందిన మిర్చి రైతులకు మిర్చిలో తామర ఎర్రవల్లి నివారణకు తీసుకోవలసిన చర్యలు గురించి ప్రకృతి వ్యవసాయ రైతు, సివిల్ ఇంజనీర్ కుడుముల వెంకట్ రామ్ రెడ్డి మరియు A D కొంగర వెంకటేశ్వరరావు అధ్యక్షతన శిక్షణ ఇవ్వడం జరిగిందిరైతులు విచ్చలవిడిగా ఎరువులు పురుగుమందులు వాడటం వల్ల భూమిలో సేంద్రీయ కర్బనం తగ్గిపోవడం వలన రైతుకు సాగు చేసిన పంట సరిగా పండటం లేదని, వ్యవసాయ శాఖ సూచించిన ఎరువులు మోతాదు ప్రకారం వాడితే మంచి దిగుబడి వస్తుందని కుడుముల వెంకట్రామిరెడ్డి తెలిపారు తామర, ఎర్రవెల్లి, పై ముడత వాటికి మన జీవన ఎరువులే మంచిగా పని చేస్తాయని తెలిపారు ఈ తెగులు నివారణకు బలేరియ, బసియన, వర్టిసేలం లాబానియ, మోటరేజియం, B D 500, వేసారియ, ట్రైకోడెర్మ, హరిజన్ మందులు రైతులు స్వయంగా తయారు చేసుకొని పంటలను కాపాడుకోవాలని రైతులను కోరారు అనంతరం రైతులకు జీవన ఎరువుల తయారీ మరియు పిచికారీ విధానం పై శిక్షణ ఇచ్చి వచ్చిన రైతులందరికీ ఉచితంగా జీవన ఎరువులను మదర్ కల్చర్స్ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏ డి ఎ కొంగర వెంకటేశ్వరరావు, ఎర్రుపాలెం ఏఈవో విజయభాస్కర్ రెడ్డి, స్థానిక ఏ ఈ ఓ, రైతు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు