రాజ్యాంగాన్ని అవమానించిన సీఎం కెసిఆర్ కు పాలించే రాజ్యాధికారం లేదు : కాంగ్రెస్

Published: Friday February 04, 2022

జగిత్యాల, ఫిబ్రవరి 03 (ప్రజాపాలన ప్రతినిధి): రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని ఉన్నత పదవిలో ఉండి సీఎం కేసీఆర్ రాజ్యాంగం మార్చాలని అనడం యావత్ దేశాన్ని దళిత బహుజన సంఘాలను అవమానించడంతో జగిత్యాల తహశీల్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజ్యాంగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్ కు రాష్ట్రాన్ని పాలించే అధికారం నైతిక హక్కు లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండ శంకర్ గాజుల రాజేందర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. రాజ్యాంగం ద్వారానే తెలంగాణ ఆవిర్భావం అయిన విషయం మర్చిపోయారా సీఎం కేసీఆర్ కభార్ధార్ అని హెచ్చరించారు. కేసీఆర్ చేసిన వాక్యలను నిరసిస్తూ బాబాసాహెబ్ అంభేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మాలీన పరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బండభాస్కర్ రెడ్డి కౌన్సిలర్ నక్క జీవన్ అల్లాల రమేష్ రావు ధర రమేష్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యకుడు గుండ మధు బాపురెడ్డి తోట నరేశ్ విద్యార్థి నాయకులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.