ఆంక్షలను అతిక్రమించినవారిపై కఠిన చర్యలు

Published: Wednesday December 29, 2021
మంచిర్యాల బ్యూరో‌, డిసెంబర్ 28, ప్రజాపాలన : నూతన సంవత్సర వేడుకల పై రాష్ట్ర ప్రభుత్వం విదించిన ఆంక్షలను అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి ఒకరు వేడుకల్ని ప్రశాంతంగా జరుపుకోవాలని మంచిర్యాల ఏసీపీ సాధన రష్మీ పేరామాల్ ఐపిఎస్ తెలిపారు. మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను అనుసరించి వచ్చే నెల (జనవరి) 2వ తారీకు వరకు  ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేదించబడటంతో పాటు, అధికారిక కార్యక్రమాల్లో హజరయ్యేవారు తప్పని సరిగా మాస్కును ధరించి, భౌతిక దూరాన్ని పాటించాల్సి వుంటుందని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకలు ప్రతి ఇంట ఆనందోత్సవాల నడుమ  నిర్వహించుకోవడంతో పాటు, జీరో యాక్సిడెంట్‌ కై కృషి చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రణకై సబ్ డివిజన్ పరిధిలో నూతన సంవత్సర వేడుకల సందర్బంగా ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహించబ డుతుందని, ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలను నడిపే వాహనదారులను కట్టడి చేసేందుకై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది అని అన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టీంలతో తనీఖీలు నిర్వహించడంతో పాటు, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకుగాను అన్ని ప్రధాన రోడ్డు మార్గాల్లో రోడ్లపై బారీకెడ్లను ఏర్పాటు చేయబడుతాయని తెలిపారు. ముఖ్యంగా యువత నూతన సంవత్సర వేడుకలను మద్యంతో కాకుండా కుటుంబ సభ్యుల నడుమ సంతోషాలతో నిర్వహించుకోవాలని చూసించారు. రాబోవు కోత్త సంవత్సరంలో ప్రజలు తాము నిర్థేషించుకున్నా లక్ష్యాలను చేరుకోవాలని, ప్రతి ఇళ్ళు సుఖ సంతోషాలకు నేలవు కావాలని ఏసిపి ఆకాంక్షించారు. ఈ సమావేశంలో మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్ నారాయణ పాల్గొన్నారు.