కరోనా బాధితులు మనోధైర్యంతో ఉండాలి

Published: Thursday January 20, 2022
శ్రీరాంపూర్ జీఎం యం. సురేష్
నస్పూర్, జనవరి 19 (ప్రజాపాలన ప్రతినిధి): కరోనా భారినపడిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని శ్రీరాంపూర్ జీఎం యం.సురేష్ అన్నారు. బుధవారం నస్పూర్ కాలనీ లోని జిటి హాస్టల్ లో కరోనా టెస్టింగ్ సెంటర్ ను ఆయన సందర్శించి కరోనా టెస్ట్ కు వచ్చిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిలో మనోధైర్యాన్ని నింపారు. కరోనా టెస్టింగ్ సెంటర్ లో రిజిస్ట్రేషన్ విధానం, టెస్ట్ చేసే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. చేతులను సబ్బుతో కడగాలని, సానిటైజ్ చేస్తూ ఉండాలని, ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని పాటించాలని, ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ని పెట్టుకోవాలని సూచించారు. క్వారంటైస్ సెంటర్లో ఉన్న ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి అందిస్తున్న వైద్య విధానం, ఆహార పదార్థాలు గురించి అడిగి తెలుసుకున్నారు. క్వారంటైస్ సెంటర్లో వంటశాలను పరిశీలించి ఉద్యోగులకు రుచికరమైన సూచికరమైన భోజనం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్ కే -8 డిస్పెన్సరీ, నస్పూర్ డిస్పెన్సరీలను సందర్శించి ఉద్యోగులకు కావలసిన అన్ని మందులను నిల్వ ఉంచుకోవాలని సూచించారు. డిస్పెన్సరీల్లో జరుగుతున్న సివిల్ వర్క్స్ పురోభివృద్ధిని ప్రత్యక్షంగా పరిశీలించి వీలైనంత తొందరగా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీ వై సీఎంఓ డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ ఉదయ్ కుమార్, డాక్టర్ రాజ స్వామి, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళి మోహస్ పాల్గొన్నారు.