మధిరలో తక్షణమే క్వారెంటైన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవి డిమాం

Published: Thursday May 06, 2021
మధిర ప్రజా పాలన ప్రతినిధి 5వ తేదీ మధిర మున్సిపాలిటీ పరిధినియోజకవర్గ కేంద్రమైన మధిరలో రోజురోజుకు  పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు తక్షణమే క్వారెంటైన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని సిపిఐ మధిర పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో కరోనా ఉధృతి గా ఉండ టం వలన క్వారెంటైన్ సెంటరను విధిగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినా ఎందుకు ఏర్పాటు చేయటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.క్వారెంటైన్ సెంటర్ ఏర్పాటు చేయడం వలన కరోనా సోకిన వ్యక్తి తీవ్రత ఎక్కువగా లేకపోతే సెంటర్ నందు వైద్యుల పర్యవేక్షణ లో 14 రోజులు ఉండి వ్యాధి తగ్గిన తర్వాత ఇంటికి వెళ్లడం ద్వారా  వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకే ప్రమాదాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుందని అని వారు తెలిపారు. అదేమీ దరిద్రమో లేకపోతే మధిరప్రాంతం పట్ల ప్రజలపట్ల చులకన భావమో తెలీదుకాని 2020 లో కృష్ణాపురం దగ్గర ఉన్న గురుకుల పాఠశాల ను DMHO గారు ప్రజా ప్రతినిధి బృందం చూసి క్వారెంటైన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని సూచించిన ఎందుకు ఏర్పాటు చేయడం లేదని  ప్రశ్నించారు. సంబంధిత అధికారులు,  స్థానిక ప్రజా ప్రతినిధులు చిత్త శుద్ధి లోపించడం వలన ఏర్పాటు చేయటంలో ఘోరంగా విఫలం చెందుతున్నారని ఆయన విమర్శించారు. 2nd వేవ్ కరోనా తీవ్రంగా వున్నా అనేకమంది దీని బారినపడి ప్రాణాలు కొల్పోతున్నా, కుటుంబం లో ఒకరికి కరోనా సోకితే ఎక్కడ ఉండాలో తెలవక కుటుంబాలకు కుటుంబాలు కరోనాతో బాధ పడుతుంటే ప్రతి బజారులో పదుల సంఖ్యలో కేసులు రోజు రోజుకి పెరుగుతుంటే, వ్యాక్సినేషన్ సెంటర్లే కరోనా వ్యాప్తికి కేంద్రాలుగా మారుతుంటే మానిటరింగ్ చేయవలసిన మండల టీమ్ ఏమిచేస్తుందని ప్రశ్నించారు. మధిరలో రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో క్వారెంటైన్ సెంటరను ఏర్పాటుచేయాలని అధికారులను ప్రజా ప్రతినిధులను అడిగినా ఫలితం శూన్యం అన్నారు. మధిర అభివృధే మాధ్యేయం అని కనబడిన కాడల్లా ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పే ప్రజాప్రతినిధుల్లారా తక్షణమే క్వారెంటైన్ సెంటరను ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల ప్రాణాలను కరోనా నుండి కాపాడాలని సిపిఐ మధిర పట్టణ కమిటీ డిమాండ్ చేస్తుంది.