నాయి బ్రాహ్మణ నాయకులు తాసిల్దార్ కు వినతి పత్రం

Published: Friday February 12, 2021
వలిగొండ  ప్రజాపాలన మంచిర్యాల జిల్లా కార్పొరేట్ సంస్థ ద్వారా 30 కుర్చీలతో  మంచిర్యాల పట్టణంలో భారీ కటింగ్ షాపులు ఏర్పాటు చేశారు.దీనికి నిరసనగా మంచిర్యాల  నాయిబ్రాహ్మణులు ఇరవై రోజుల నుండి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా వారికి మద్దతుగా గురువారం నాయిబ్రాహ్మణ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నాగేల్లి వలి ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఉన్న నాయిబ్రాహ్మణులు షాపులు మూసివేసి కొత్త బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించి స్థానిక తాహసిల్దార్ కె నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు.అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడు వలి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన సెలూన్లను వెంటనే రద్దు చేయాలని నాయి బ్రాహ్మణ కుల వృత్తిని నాయి బ్రాహ్మణులు చేసుకునే విధంగా ప్రభుత్వం జీవో తీసుకరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ నాయకులు రాచమల్ల తిరుపతయ్య, పాండు, కృష్ణ, నాగేష్, రాములు, శేఖర్, దయాకర్, ప్రభాకర్, మహేష్, కృష్ణ, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, సతీష్, చంద్రయ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.