బుద్ధుడి ... డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ల స్ఫూర్తితో వివాహo జరిగింది

Published: Monday April 25, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 24 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామంలో ఆదర్శ బుద్ధ వివాహం ఆదివారం  జరిగింది. కుల పిచ్చి, మత పిచ్చి అనే నినాదాలతో నేడు కొట్లాటలతో ముడిపడిన విషయం అయితే నాగన్ పల్లి గ్రామానికి చెందిన గడుసు ప్రవీణ్, దండుమైలారం గ్రామానికి చెందిన మరాఠీ సంపూర్ణ బుద్ధ వివాహం ఇరువురి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరై వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  అప్పట్లో  బుద్ధ వివాహ లేవని, సమాజం మారుతున్నప్పటికీ  వారు చేసిన త్యాగాలు స్మరించుకుని బౌద్ధమతం అంబేద్కరిజం రావడంతో వారి ఆశయ సాధనలో గుర్తుంచుకొని మేము ఈ వివాహానికి అంగీకరించాము మొదటగా బుద్ధుడికి, అంబేద్కర్ కి క్యాండిల్స్ వెలిగించి పూజ జరిపారు. బుద్ధ శరణం గచ్చామి, జై భీమ్ అనే నినాదాలతో వివాహం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండలంలో ఇదే  తొలి బుద్ధ వివాహమని తెలిపారు.