జగిత్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

Published: Wednesday July 07, 2021
పల్లెప్రగతి హరితహారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
జగిత్యాల / రాయికల్  జులై 06 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల రూరల్ మండలం హాబ్జీపూర్ గ్రామంలో సోమవారం రాత్రి పల్లెప్రగతి కారేక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పల్లెనిద్ర చేపట్టారు. మంగళవారం ఉదయం గ్రామంలో పల్లెప్రగతి వైకుంఠదామం హరితహారం పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించి పరిశీలించి గ్రామంలో పలు సమస్యలను అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాయికల్ మండలంలో భూపతిపూర్ బిట్ రోడ్డు అల్లిపూర్ రైతువేదిక అభివృద్ధి కార్యక్రమాలలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ తో కలసి రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం వైకుంఠదామం మరియు కంపోస్ట్ షేడ్ ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించి అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జి. రవి జడ్పీ సీఈవో వినోద్ జిల్లా పంచాయతీ శాఖ అధికారి పల్లికొండ నరేష్ ఆర్డీవో మాధురి డిఆర్డీఏ పిడి లక్ష్మీనారాయణ జిల్లా గ్రంధాలయ చైర్మన్ డా: గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ ఎంపీపీ లావుడ్య లావణ్య జడ్పీటీసీ అశ్విని జాదవ్ సంగెపు మహేష్ పాలేపు రాజేంద్రప్రసాద్ మూలసపు లక్ష్మీ ఎంపీడీవోలు తహశీల్దార్లు అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.