బావుల పూడికతీత పనులకు నిధులు మంజూరు : ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్

Published: Thursday November 25, 2021
వికారాబాద్ బ్యూరో 24 నవంబర్ ప్రజాపాలన : గ్రామాలలోని బావుల పూడికతీత పనులకు నిధులు మంజూరు అయ్యాయని ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్ అన్నారు. బుధవారం మర్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సాంకేతిక సహాయకులు విట్టల్ రావు సోమలింగం ఎంపిఓ అంజిరెడ్డి ఏపీఓ శ్రావణ్ కుమార్ లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గ్రామంలోని పేదలకు పశువుల షెడ్లు, అవసరమైనవారికి మేకల షెడ్డు, కొత్త బావుల తవ్వకం మంజూరు చేయుటకు కొరకు మూడు లక్షల 50 వేలు వస్తుందన్నారు. బావులు పూడికతీత తీసుకొనవచ్చునని పేర్కొన్నారు. పంట నూర్పిడి కల్లాలకు 85 వేల రూపాయలు, బావులు పూడికతీత 50 వేల రూపాయల నుండి ఇ లక్ష 50 వేల రూపాయల వరకు మంజూరవుతాయని వివరించారు. పండ్ల తోటల పెంపకం మామిడి జామ బత్తాయి మొదలగు తోటలు మంజూరు చేయబడతాయని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీలకు పది ఎకరాల వరకు బిసి ఓసిలకు ఐదు ఎకరాల కంటే గోకులం ఉండరాదన్నారు. ఫారం పాండు కాలువలు తీయుట మొదలగు పనులు మంజూరు చేయబడతాయని తెలిపారు. నూతన నర్సరీలు పెంపకం, మొక్కలు పెంచుటకు విత్తనాలు  కొని గ్రామ పంచాయతీలే నర్సరీలలో పెట్టాలని ఎంపిడిఓ పేర్కొన్నారు.