ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

Published: Wednesday January 04, 2023
బోనకల్, జనవరి 3 ప్రజా పాలన ప్రతినిధి: సావిత్రి బాయి పూలే 192 వ జయంతి వేడుకలు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయం నందు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి గ్రామ సర్పంచ్ భూక్య సైదా నాయక్, రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ బిపి నాయక్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం పిల్లలకు సర్పంచ్ సైదా నాయక్, బిజెపి యువనేత, రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ బిపి నాయక్, మండల పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో తొలి ఉపాధ్యాయిని , సంఘసంస్కర్త , మహిళల అభ్యున్నతికి పోరాటం చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు విద్యావేత్త సావిత్రిబాయి పూలే అని, యుగానికి ఆదర్శమూర్తి నేటి ఆధునిక మహిళా చైతన్యానికి నిత్య చైతన్య మూర్తిగా, స్త్రీల విద్యాభివృద్ధి, స్త్రీల హక్కుల కోసం, స్త్రీలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యల పరిష్కారానికి చదువు ఒక్కటే ఆయుధం అని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి, మహిళా శక్తి భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా కొనియాడబడుతున్న చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.