సర్వే నంబర్ 211 201 204 లో 380 ఎకరాల ప్రభుత్వ భూమి సాగు చేస్తున్న 3 గ్రామాల రైతులకు అసైన్డ్ పట్టాలు ఇవ

Published: Wednesday July 27, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 26 ప్రజాపాలన ప్రతినిధి.సర్వే నెంబర్  211 201 204 లో వున్నా 380 ఎకరాల ప్రభుత్వలో  భూమిలో వేసిన బోర్లు పంటలు భూములను పరిశీలించిన అనంతరం  తెలంగాణ రైతు జిల్లా అధ్యక్షులు బి మధుసూదన్ రెడ్డి  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం  జిల్లా కార్యదర్శి కందుకూరి  జగన్  మాట్లాడుతూ
యాచారం మండలం పరిధిలోని  నందివనపర్తి  ఓంకారేశ్వర దేవాలయం భూమి  సుమారుగా 1400 ఎకరాల  భూమిని తరతరాలుగా  నందివనపర్తి  తాటిపర్తి కుర్మిద్ద సింగారం  రైతులు సాగు చేస్తూ  కౌలు  చెల్లెస్తున్నారు. గత 45 సంవత్సరాల నుండి   211 201 204  లో వున్నా 380 ఎకరాలు   ప్రభుత్వ భూమని  కౌలు తీసుకోవడం లేదు.ఇట్టి భూమిలో  భావులు  బోర్లు వేసి నారు కరెంటు  మంజూరు అయింది   బాగా అభివృద్ధి చేయడం జరిగింది  ఈభూమినీ నమ్ముకొని జీవిస్తున్నారు ఈ భూమిపైన   కొంత మంది  పెద్దల కన్ను పడింది  రైతులను ఈ భూములనుండి  వెళ్లగొట్టడం కోసం  ప్రయత్నం జరుగుతుంది  కాబట్టి వీరికి ఈ భూములు తప్ప మరో భూములు లేవు  ఈ
భూములను నమ్ముకుని జీవిస్తున్నారు కాబట్టి సాగు చేస్తున్నా మూడు గ్రామాల రైతులకు  అసైన్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలని  ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి అంజయ్య   kvps జిల్లా నాయకులు ఆలం పల్లి నర్సింహా వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ch సత్యం రైతు సంఘం  మండలం కార్యదర్శి ఎంపీ నర్సింహా   రైతులు జె రాములు D రవి  సంజీవ గోపాలు జ్యోతి రమ్ములమ్మ చెన్నమ్మ   జ్యోస్నా  యాదమ్మ  చంద్రమ్మ  పొన్నమ్మ పాండు అంజయ్య  ch శ్రీకాంత్ ఎం లక్ష్మయ్య  కృష్ణ  చెన్నయ్య  స్వప్న  పోషమ్మ తదితరులు  పాల్గొన్నారు