బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లపై కాంగ్రెస్ పోరాడాలి

Published: Thursday March 02, 2023
జన్నారం, మార్చ్ 01, ప్రజాపాలన: 
 
బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లపై కాంగ్రెస్ పోరాడాలని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ విలేకరులతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన సమయంలోనే 75 ఏళ్ల పూర్వమే చట్టసభలైన అసెంబ్లీ పార్లమెంటులలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించవలసిన అగ్రవర్ణ నాయకులైన అప్పటి నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మురారి దేశాయ్, లాల్ బహుదూర్ శాస్త్రి తమ అధికార లాలసత్వం అంటూ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి, బీసీల మధ్య మా అగ్రవర్ణ ధనిక కులాల మధ్యనే రాజకీయ పోటీ ఉండాలని భావించి బీసీ కులాల వారికి రాజకీయ అధికారం దక్కనీయకుండా చూసుకునరన్నారు. 75 ఏళ్లుగా ఎంతమంది అగ్రవర్ణాల నాయకులు అధికారం చేపడుతూ వస్తున్నారో అంతమంది అదే పద్ధతిని పాటిస్తూ బీసీలను రాజకీయ ఆర్థిక సాంఘిక రంగాల్లో అడగ దొరుకుతూ వస్తునరన్నారు. ప్రస్తుతం బీసీ కులాల సమాజం చైతన్యవంతమైనదని తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎక్కడైతే అధికార పోగొట్టుకున్నారో అక్కడే అధికారం సాధించుకోవాలని తపనతో అర్థంతో ఆశతో అడుగులు వేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా అధికారంలో కొనసాగిన నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లు బీసీలకు అధికారం దక్కనీయకుండా 60 ఏళ్లు ఒక పార్టీ వారే పరిపాలించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆడిన నాయకులు చేసిన తప్పిదం వలన అధికార లాలస వలన బీసీ కులాల వారు రిజర్వేషన్ల ద్వారా చట్టసభలలో అడుగుపెట్టలేక పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ నని వారన్నారు. నెహ్రూ, గాంధీ కుటుంబాల వారే ఈ దేశాన్ని ఉదయించాలన్న ఆలోచన దేశ ప్రజలలో 20 శాతం ఇంకా మిగిలివుందన్నారు. ఇది కాపాడుకోవాలంటే 2024 లోక్సభ ఎన్నికల నాటికి చట్టసభలైన అసెంబ్లీ పార్లమెంటులలో బీసీ కులాల వారికి రిజర్వేషన్లకై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆది నాయకులైన రాహుల్ గాంధీ, ప్రియాంక ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే అన్ని రాష్ట్రాలలో పిసిసి అధ్యక్షులుగా కొనసాగుతున్న భాషరతుగా ప్రయత్నించవలసిన సందర్భం ఆసన్నమైందన్నారు. 2024 లోక్సభ ఎన్నికలలోగా చట్టసభలైన అసెంబ్లీ పార్లమెంటులో బీసీ కులాల వారికి రిజర్వేషన్లు ఏర్పరచని యెడల అణాగారిన బీసీ కులాల భారత దేశ ప్రజలు ఓపిక పట్టే స్థితిలో లేరని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ కాసెట్టి లక్ష్మణ్, కే ఏ నరసింహులు మూల భాస్కర్ గౌడ్ ఆడెపు లక్ష్మీనారాయణ కాడల నరసయ్య మామిడి విజయ్ రాజన్న వేయిగండ్ల రవి తదితరులు పాల్గొన్నారు.