సిరికొండ గ్రామ హమాలి సంఘ అధ్యక్షులుగా శ్రీనివాస్

Published: Thursday November 18, 2021

జగిత్యాల, నవంబర్ 17 ( ప్రజాపాలన ప్రతినిధి): సిరికొండ గ్రామ హమాలి సంఘము అధ్యక్షులుగా నక్క శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కట్ట అంజయ్య లను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు సంబు కొమురయ్య బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. సంబు కొమురయ్య మాట్లాడుతూ సంఘం ఉపాధ్యక్షులుగా జక్కుల సత్తయ్య, కోశాధికారిగా అల్లే గట్టయ్య, కార్యవర్గ సభ్యులుగా పంచిక తిరుపతి, కప్ప రాజేందర్, కసాడీ చంద్రన్న, అల్లే కొమురయ్య, అంజయ్య, అనిల్ లను నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  బుగ్గారం మండల శాఖ అధ్యక్షులు పంచిక లక్ష్మణ్ తోపాటు పలువురు ఉన్నారు.