అసంబద్ధ దస్తావేజులను రద్దు చేయాలని కలెక్టరుకు ఫిర్యాదు

Published: Thursday November 18, 2021

కోరుట్ల, నవంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల పట్టణంలోని సర్వే నంబర్ 1371 లో జాతీయ రహదారికి సమీపంలో  లయన్స్ క్లబ్ వాటర్ ప్లాంట్ కు దగ్గర ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న,ఇతరులు సైతం యాజమాన్య హక్కులు కలిగిన  స్థలములో అనుమతులు లేని అక్రమ నిర్మాణం జరుగుతున్న టీన్ షెడ్ నిర్మాణంపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణం కొంత భాగమును కూల్చి పనులు ఆపి వేయగా యజమాని పెద్ద కుమారుడు యజమాని పేరున హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి తాను నిర్మించుకున్న/ నిర్మిస్తున్న నిర్మాణమును కూల్చవద్దని స్టేటస్కో ఉత్తర్వులను తీసుకొని వచ్చిన దాదాపు ఇరవై రోజుల తర్వాత అక్రమ టీన్ షెడ్ నిర్మాణము ఉన్న స్థలమును ఖాళీ స్థలముగా చూపిస్తూ కోరుట్ల సబ్ రిజిస్ట్రార్ ద్వారా కొత్తగా దాన దస్తావేజును 3971/2021 విస్తీర్ణము:405.32చ.గజముల భూమిని మరియు 3972/2021 విస్తీర్ణము:130.67 చ.గజములను అసంబద్ధ రీతిలో అక్రమంగా దస్తావేజులు వ్రాయించుకున్నారు. ఇట్టి విషయంపై స్థల యజమాని రెండవ కుమారుడు అల్లాడి మహేష్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ అసంబద్ధ రీతిలో అక్రమ టీన్ షెడ్ నిర్మాణం ఉన్న చోటును ఖాళీ స్థలంగా చూపిస్తూ అక్రమ రీతిలో కోరుట్ల సబ్ రిజిస్ట్రార్ అవినీతి అధికార దుర్వినియోగంతో అసంబద్ధ దస్తావేజులు తయారు చేయించుకున్నారని తను వారసుడని ఉండగా స్టేటస్ కో ఉత్తర్వులు ఉండగా ఆ అసంబద్ధ దస్తావేజులు ఏ విధంగా చెల్లుబాటు అవుతాయో పూర్తిస్థాయి విచారణలు జరిపి దస్తావేజుల తయారీకి సహాయ సహకారాలు అందించిన కోరుట్ల సబ్ రిజిస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జగిత్యాల  ఫిర్యాదు చేశానని తెలియజేశారు