వరి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసిన వెంటనే చెల్లింపులు జరిపి రైతులను ఆదుకోవాలి

Published: Thursday November 25, 2021

రాయికల్ , నవంబరు 24 (ప్రజాపాలన ప్రతినిధి) : కాంగ్రెస్ నాయకులు డిమాండ్ వరి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసిన వెంటనే చెల్లింపులు జరిపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం రోజున రాయికల్ తహసీల్దార్ కుందారపు మహేశ్వర్ కు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్రావు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వరి ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు బాధ్యతలు మాది కాదు అంటే మాది కాదు అంటూ పట్టించుకోకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు, రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది కేంద్రం  ప్రకటించిన మద్దతు ధర జాబితాలో 23 పంటలతో పాటు వరి పంట కూడా ఉంది మద్దతు ధర ప్రకటించడం అంటే ప్రభుత్వం కొనుగోలు చేయడం అని అర్థం అందువల్ల రైతులు పండించిన వరి ధాన్యం పంటను ప్రభుత్వం కచ్చితంగా కొనుగోలు చేయాలి, కానీ రాష్ట్రంలో పంట ఎంత వస్తుంది ఇప్పుడు ఎంత వచ్చింది అన్న వివరాలు ప్రభుత్వం వద్ద లేవు ముందస్తు ప్రణాళిక లేకుండా ఉండడంతో రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారన్నారు. 62 లక్షల ఎకరాలలో వరి వేశారని కోటి క్వింటాల్ల ఉత్పత్తి వస్తుందని ప్రభుత్వం అంచనాలు ఉన్నా పంట చేతికి వచ్చి నెల రోజులు అవుతున్నా ప్రభుత్వం కేవలం 11 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. రాష్ట్రంలో ఐకెపి, సహకార సంఘాల ద్వారా 6772 కొనుగోలు కేంద్రాలు తెరవాల్సి ఉండగా కేవలం 4743 కేంద్రాలు పేరుకు మాత్రమే ఓపెన్ చేశారు. ఇందులో సగం కూడా కొనుగోలు చేయడం లేదని, లక్ష క్వింటల ధాన్యం నీరు కల్లల్లో రోడ్ల పైన ఉండిపోయి వర్షానికి తడిచి పాడైపోయింది అలాగే దాన్యం వరదలకు కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నరని వాపోయారు. ధాన్యం కొనుగోలు చేయగానే వీరికి సకాలంలో డబ్బులు చెల్లించి భారీ వర్షాలు వరదల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి రాబోయే రోజులలో సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేసి ధాన్యం రైతులకు భరోసా కల్పించాలని మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుర్రం మహేందర్ గౌడ్, కొయ్యడి మహిపాల్ రెడ్డి, యెద్ధండి దివాకర్రెడ్డి, యెలేటి జలేందర్రెడ్డి, సూధవేని మురళీగౌడ్, కొడి పెళ్లి ఆంజనేయులు, వాస౦ దిలిప్, ముస్తాక్ అహ్మద్, గ౦గా రెడ్డి, భూమయ్య, రాములు, రాజిరెడ్డి, బాపురపు నర్సయ్య నాయకులు పాల్గొన్నారు.