ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి **

Published: Saturday December 17, 2022
సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా **
 
ఆసిఫాబాద్ జిల్లా డీసెంబర్ 16(ప్రజాపాలన,ప్రతినిధి) : ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని గురువారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అల్లూరి లోకేష్, ముంజం శ్రీనివాస్ లు మాట్లాడుతూ ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేయాలని ఆశ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రవహిస్తుందని అన్నారు. ఉన్న సమస్యలు పరిష్కరించకపోగా అదనంగా లెప్రసీ, కంటి వెలుగు లాంటి పనులు టెస్టులు చేపిస్తూ వ్యక్తి చాకలి చేయించుకుంటున్నారని అన్నారు. గతంలో చేసిన లెప్రసీ  సర్వే, కంటి వెలుగు బకాయిలు ఇప్పటివరకు ఇవ్వలేదని, 16 నెలల పెండింగ్ కరోనా రిస్క్ అలవెన్స్ బకాయిలు ఇవ్వలేదని, వైద్యశాఖ సర్వే లేకుండా అనేక డిపార్ట్మెంట్ల సర్వేలు ఆశా కార్యకర్తలు నిర్వహిస్తున్నారన్నారు. వీటికి ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని, ఎలక్షన్ డ్యూటీ, ఎగ్జామ్స్ డ్యూటీలు, ప్రతి పనికి ఆశా కార్యకర్తలను ముందుంచి సర్వేలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తి చాకిరిని రద్దుచేసి ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, అదనపు పనికి అదనపు పారిపోషకం చెల్లించాలని, కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ రాజేశంకు అందజేశారు.
 యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మ, స్వరూప, లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పిస్తానని గద్దినెక్కిన కేసీఆర్ ప్రభుత్వం ఆశా కార్యకర్తల సమస్యలను పట్టించుకోవడంలేదని, ఆడపడుచులను అవమానించినట్టుగా భావిస్తున్నామని అన్నారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు చారి, యూనియన్ నాయకులు పంచశీల, వనిత, బద్రుబాయి, సునీత, జ్వతాబాయి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.