*ఘనంగా సిపిఐ 98వ వ్యవస్థాపక దినోత్సవం* -ప్రజా సమస్యలే లక్ష్యంగా పని చేస్తున్న ఏకైక పార్టీ, సిప

Published: Tuesday December 27, 2022


చేవెళ్ల డిసెంబర్ 26, (ప్రజాపాలన):-

చేవెళ్ల మండలకేంద్రంలో
భారత కమ్యూనిస్టు పార్టీ 98వ వ్యవస్థాపక  దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే రామస్వామి ఎం ప్రభు లింగం హాజరై, జిల్లా కార్యవర్గ సభ్యులు కే రామస్వామి, నాయకులు, కార్యకర్తలతో కలిసి  జెండాను ఎగరవేశారు.
అనంతరం కేకు కట్ చేసి పార్టీ శ్రేణులు ఒకరికి ఒకరు కేకు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికీ కొనసాగుతున్న అతి కొద్ది రాజకీయ పార్టీలలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రముఖమైనది అని 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో స్థాపించబడిందని ఇప్పటికి 97 వసంతాలు పూర్తిచేసుకుని 98వ ఏట అడుగుపెడుతుందని ఆయన అన్నారు ప్రపంచ పరిణామాలు గమనిస్తే వామపక్ష పార్టీలకు ప్రత్యేకించి సిపిఐ కు మంచి రోజులు రాబోతున్నట్లు ఆయన అన్నారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కను సన్నల్లో దేశాన్ని తీరుగమనంలోకి తీసుకెళ్తుందని భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరైన భారతదేశంలో విభజన తీసుకొస్తుందని లౌకిక దేశమైన భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు కుట్రలు పన్నుతుందని కార్పొరేట్లకు ఒకరిద్దరికి దేశ సంపద ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కట్టబెడుతుందని వ్యవసాయాన్ని సైతం కార్పోరేట్లకు కట్టబెట్టే చట్టాలను తీసుకురాగా రైతుల వీరోచిత పోరుతో మోడీ వెనక్కి తగ్గాల్సి వచ్చిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ ఏఐకేఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ గౌడ్ చైర్మన్ మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి సహాయ కార్యదర్శి ఎం డి మక్బుల్ గీత పని వాళ్ళ సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ రాములు గౌడ్ లక్ష్మణ్ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి డి మల్లేష్ ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు శివ బిఓసి మండల నాయకుడు శ్రీను మేస్త్రి రాములు మేస్త్రి రఘు మహేందర్ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజుల మాధవి సాయిలమ్మ విజయమ్మ మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.