నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరోత్సవం ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు హాజరు

Published: Wednesday January 11, 2023

బోనకల్, జనవరి 9 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని గార్లపాడు గ్రామం నందు శ్రీ వేణుగోపాల స్వామి, ఆంజనేయస్వామి ఆలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నేడు అనగా 10.01.2023 బుధవారం సాయంత్రం ఐదు గంటలకు కలదు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్, మధిర నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ లింగాల కమల్ రాజు విచ్చేయుచున్నారు. కావున మండలంలోని బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, బీ ఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాము.