ఉప్పరిగూడ లో సి సి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన సర్పంచ్ బూడిద రాంరెడ్డి

Published: Tuesday September 28, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి ఉత్సవాలు గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. మొత్తం లక్షా పదివేల రూపాయల చెక్కులు
1. కొంగరి శ్రీ చరణ్.28000
2. నరకుడి రేణుక.22000
3. పో రెడ్డి మహేందర్ రెడ్డి.18000
4 మంత్రి నరసింహ.14000
5. షేక్ మునీర్.14000
6. గడ్డి శివకుమార్.14000
అనంతరం ఎనిమిదో వార్డ్ ఆరు లక్షల వ్యయంతో వార్డులో సిసి రోడ్డు పనులను సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి మరియు పాలకవర్గం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరసింహా రెడ్డి వార్డు సభ్యులు శ్రీనివాస్, పద్మమ్మ, శశిరేఖ, మహేందర్, కో ఆప్షన్ సభ్యులు గోపాల్, మరియు తెరాస నాయకులు బోసు పెళ్లి విరేష్ కుమార్, బి వెంకటేష్ యాదవ్, నర్కుడి శ్రీనివాస్, బి.మహేందర్, బి.కర్ణాకర్, ఎం.వెంకటేష్, కె.శ్రీకాంత్, శేఖర్, బి.వెంకటేష్, కే.ప్రశాంత్, కార్యదర్శి రిషిక నేత కారోబార్ నరసింహ్మ పాల్గొన్నారు.