*ఐసిఎఫ్ఏఐ (icfai)యూనివర్సిటీ విద్యార్థులు కార్ రేసింగ్ తో వీరంగం* -నిండు ప్రాణాన్ని బలిగొన్న యూ

Published: Thursday February 16, 2023

- ఐ సి ఎఫ్ ఏ ఐ యూనివర్సిటీ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.*

ఎస్ఏఫ్ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బాయికాడి శంకర్*

చేవెళ్ల ఫిబ్రవరి 15, (ప్రజాపాలన):-

రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న icfai యూనివర్సిటీ విద్యార్థులు దాని పరిసరప్రాంతంలో నిత్యం బైక్ ,కార్ రేసింగ్ లతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అనివాపోతున్నారు. మంగళవారంనాడు  మిర్జాగుడా సమీపంలోని కొల్లూరు గేట్ వద్ద కార్ రేసింగ్ తో వీరంగాన్ని సృష్టించి అమయకురాలైన ఒక మహిళ నిండు ప్రాణాన్ని బలిగున్నారని, ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భాయ్ కాడ శంకర్అన్నారు. యూనివర్సిటీ టైమ్ లో విద్యార్థులు బయటకు వెళ్లి రేసింగ్ చేస్తుంటే యూనివర్సిటీ యాజమాన్యం చూడనట్లుగా, మాకు ఎం సంభందం అన్నట్లుగా వ్యవహరిస్తోంది అని అన్నారు.విద్యార్థుల పట్ల యూనివర్సిటీ యాజమాన్యం అశ్రద్ధ వహించడం  వలన ఒక కుటుంబంలో ఒకరికి గాయలై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు ఒక  మహిళ మృతి కి కారణమైన విద్యార్ధులపై చర్యలు తీసుకోవాలని icfai యూనివర్సిటీ పై ప్రభుత్వం  చర్యలు  తీసుకోవాలని ఎస్ ఫ్ ఐ డిమాండ్ చేస్తోంది అని అన్నారు.  ఈ కార్యక్రమంలో  జిల్లా ఉపాధ్యక్షుడు చరణ్,జిల్లా కమిటీ సభ్యులు శ్రీకాంత్, స్టాలిన్ అరుణ్ లు పాల్గొన్నారు.