పోడు భూములు జోలికి వస్తే ఊరుకునేది లేదు...CPM

Published: Friday March 19, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. జూలూరుపాడు మండలం. ప్రజా పాలన .స్థానిక సిపిఎం పార్టీ ఆఫీసులో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చీమలపాడు బిక్షం పోడు పరిరక్షణ కమిటీ కన్వీనర్ బానోత్ ధర్మాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్  గ్రామం లో ఉన్న సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పిండు. మరోవైపు ఫారెస్ట్ అధికారులు సాగులో పొడుపు రైతులకు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. జెసిబి తో పోడు భూములలో మొక్కలు నాటడానికి ఫారెస్ట్ అధికారులు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మండలంలోని సూరారం. రాజా రావు పేట .వినోబానగర్ .పాపకొల్లు .రాంపురం .తదితర గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు ఆగడాలకు హద్దే లేదు. పోడు సాగు రైతుల జోలికి వస్తే ప్రజా ఉద్యమం తప్పదని అన్నారు . పోడు సాగు దారులు కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.ముఖ్యమంత్రి చెప్పిన విధంగా స్థానిక అధికారులు పోడు రైతుల భూములకు సమగ్ర సర్వే చేసి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఊడల వెంకటేశ్వర్లు. జి వెంకటి. ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్. ఎస్ఎఫ్ఐ మండల నాయకులు యశ్వంత్. తదితరులు పాల్గొన్నారు