విగ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన గణేశుల రవి..

Published: Monday September 05, 2022

తల్లాడ, సెప్టెంబర్ 4 (ప్రజాపాలన న్యూస్):

తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగు లేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరులు, టిఆర్ఎస్ నేత గణేశుల రవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలో (ముదిరాజ్ లు) విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ పిలుపుమేరకు ఆయన హాజరై వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గణనాధుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని గణేశుల రవి ఆకాంక్షించారు. వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎస్సీ, బీసీ కాలనీల వాసులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.*