భాజపా ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

Published: Wednesday April 07, 2021
బాలాపూర్, ఏప్రిల్ 06 ప్రజాపాలన ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బాలాపూర్ గ్రామంలోని 15వ, 16వ, 17వ డివిజన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ సింగిల్ విండో చైర్మన్ కొలన్ శంకర్ రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర సఫాయి కర్మచారీ జాయింట్ కన్వీనర్ గడ్డం వెంకటేష్, బ్యాంక్ డైరెక్టర్లు కొంతం సంపత్ రెడ్డి, కళ్లెం లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నవారు శ్రీనివాస్ రెడ్డి, బి ఎం సి ప్రధాన కార్యదర్శి జోరాల ప్రభాకర్, బీజేవైఎం, బి ఎం సి ఉపాధ్యక్షుడు అరవింద్, రమిడీ శేఖర్ రెడ్డి, భిక్షపతి, ఆలేటి శ్రీకాంత్, జంగయ్య, జగన్, లక్ష్మణ్ రాజు  పార్టీ అభిమానులు పాల్గొన్నారు.