రేషనలైజేషన్ ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలి రైతు నేత ఓసి సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్

Published: Tuesday July 26, 2022

కరీంనగర్ జూలై 25 ప్రజాపాలన ప్రతినిధి :

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ హేతుబద్ధీకరణ చేయడానికీ ప్రభుత్వం పూనుకోవడం మానుకోవాలని ఈ మేరకు విడుదలైన జీ వో నెంబర్ 25 ను తక్షణమే ఉపసంరించుకోవాలని రైతు ఉద్యమ నేత ఓసి సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు

సోమవారము కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాద్యాయులు నిర్వహించిన నిరసన కార్యక్రమం లో నాయకుల తో కలిసి పోలాడి రామారావు హాజరై ఓసి సామాజిక సంఘాల సమాఖ్య తరఫున సంఘీభావం తెలిపారు

ఈ సంధర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల రేషనలైజేషన్ హేతుబద్ధీకరణ ఉత్తర్వుల కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వాదులు రాజకీయ పార్టీల నాయకులు గల మెత్తాలన్నారు

ఇప్పటికే 317 జీవో తో సతమవుతూ ఇప్పుడిప్పుడే టీచర్లు సర్దుకుంటున్న స్థితిలో రేషనలైజేషన్ ఉత్తర్వుల వల్ల మళ్లీ గందరగోళ పరిస్థితిలు ఏర్పడి ఉపాద్యాయులు తీవ్ర ఇబ్బందుల పాలవుతారని అన్నారు

రేషనలైజేషన్ ఉత్తర్వులు రద్దు చేసి ఉపాధ్యాయుల ప్రమోషన్లు పరస్పర అంగీకార బదిలీలను వెంటనే చేపట్టాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు లేకుంటే అన్ని సంఘాలను కలుపుకొని ఉదృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు

ఇప్పటికే పక్క ఏపీ రాష్ట్ర సీఎం జగన్ ఉపాధ్యాయుల తీవ్ర నిరసన ఎదుర్కొంటున్నారని జగన్ లా సీఎం కేసిఆర్ ఉపాద్యాయుల నిరసన ఎదురు కాకుండా వ్యవహరించాలని సీఎం కేసిఆర్ కు రామారావు విజ్ఞప్తి చేశారు

ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఓసి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి నాయకులు రామిడి రాజిరెడ్డి మడుపు మోహన్ అందెం ప్రభాకర్ రెడ్డి సదానందచారి తిరుపతి రెడ్డి కంకణాల జనార్థన్ లతో పాటు పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.