మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెండింగ్ బిల్లులు చెల్లించాలి

Published: Friday June 17, 2022
జిల్లా నాయకుడు మామిడి విజయ్
 
జన్నారం రూరల్, జున్ 16,: ప్రజాపాలన: 
 
మధ్యాహ్న భోజన కార్మికుల కు సంబంధించిన వేతనాలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని సిఐటియు జిల్లా నాయకుడు మామిడి విజయ్ అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో  మాట్లాడారు. గత ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలు అందక మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నారన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కార్మికులందరూ పస్తులుండే పరిస్థితి వచ్చిందని తెలిపారు,  విద్యా సంస్థలను గతంలో స్కావెంజర్స్ శుభ్రపర్చినారని ,ఐతే వారిని  గత సంవత్సరం తొలగించారని తెలిపారు. , ప్రస్తుతం పాఠశాల శుభ్రతను మధ్యాహ్న భోజన కార్మికులతో చేయిస్తున్నారని తెలిపారు. మార్చి పదిహేను తేదినా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి నట్లు పెంచిన వేతనాలకు రెండు వేలు కలుపుకుని మూడు వేలు చెల్లించాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకుడు బుచ్చన్న, స్థానిక సినియార్ మధ్యాహ్న బోజన కార్మికురాలు మల్లవ్వ, తదితరులు పాల్గొన్నారు.