విద్యార్థి మృతి పై పూర్తి విచరణ జరిపించాలి విబిఏ పార్టీ జిల్లా అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డ

Published: Monday November 14, 2022

జన్నారం, నవంబర్ 13, ప్రజాపాలన: నిర్మల్ జిల్లా బైంసాలో గల మైనార్టీ గురుకులం లో అనుమాన స్పదంగా ఉరి వేసుకొని మృతి చెందిన నవాజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువురున్న విద్యార్థి మృతి పై అనేక అనుమానాలు ఉన్నాయని పూర్తి విచారణ జరిపించాలని వంచిత్ బహుజన్ ఆఘాడి విబిఏ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల అధ్యక్షులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో మాట్లాడుతూ అనేక ఇబ్బందుల మధ్య విద్యార్థులు చదువులను కొనసాగిస్తున్నారని అన్నారు. గురుకుల విద్యాలయాలలో ఆశ్రమ పాఠశాలలో  హస్టళ్లలో ఒక ఉన్నత కమిటీ లేదా సిటింగ్ జడ్జి తో కమిటీ వేసి విచారణ జరిపించాలి, అడిట్ నిర్వహించాలి. ఈ సందర్భంగా ఇస్తారాజ్యాంగ బిల్లులు పెడుతు విద్యార్థుల కడుపులు కొట్టి కోట్ల రూపాయలు సంపాదించి బిల్డింగ్ లు ఆస్తులు పిల్లల చదువులకు ఎంజాయ్ చేయడానికి లక్షల రూపాయలు ఎక్కడి నుండి వస్తున్నాయి విటన్నిటిపై ఇడి, ఇన్ కమ్  ట్యాక్స్ అధికారులతో సిబిఐ, ఏసిబి అధికారులతో దాడులు చేయించాలి.  ప్రవేట్ పాఠశాలల కళాశాల పేరుతొ వేల కోట్లు విద్యార్థుల వారి తల్లిదండ్రుల పొట్టలు కొట్టి వారికి ఇష్టం వచ్చినట్లు పీజులు పెంచి దోపిడీ చేస్తున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులకు మాములుగా గౌరవ వేతనాలు ఇస్తూన్నరు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన గురుకులాలకు  కొత్త భవనాలకు బడ్జెట్ రిలీజ్ చేసి వెంటనే టెండర్ లు పిలువాలి, మరికొన్ని బాలుర, బాలికల గురుకులాలు కొత్తవి సంక్షేన్ చేయాలి, మరియు ప్రవేట్ పాఠశాలల కళాశాలల యాజమాన్యాల పై అడిట్ చేయించాలి. ఎస్ సి, ఎస్ టి, బిసి, మైనార్టీ హాస్టల్, గురుకులలొ కాస్తుర్భలలో పని చేస్తున్న టీచర్లపై ఇంచార్జులపై ప్రిన్సిపాల్ లపై వార్డెన్ లపై హెడ్ మాస్టర్ లపై పూర్తి స్థాయి విచారణ వారి వారి ఆస్తుల పై జరిపించాలి. గతంలో వారి అస్తులు ఎంత ఉద్యోగం రాకముందు వచ్చిన తరువాత సంవత్సరం సంవత్సరం ఆదాయం ఎంత పెరిగింది పిల్లలకు ఎంత ఖర్చు చేస్తున్నారు. వారి లెగ్జారి ఖర్చు రోజువారీ ఖర్చు ఎంత విటన్నిటిపై విచారణ జరిపించాలని అయన కోరారు.