మేాకుదెబ్బ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ

Published: Monday March 13, 2023

జన్నారం, మార్చి 12, ప్రజాపాలన: తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ ఆధ్వర్యంలో నూతన 2023 క్యాలెండర్ ను మండల కేంద్రంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బలసాని శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఆదివారం మండల కేంద్రంలోని  విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌడ జాతి సమస్యలపై పోరాడేందుకు మోకు దెబ్బ ఏప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. గౌడ సంఘ సభ్యుల అన్ని సమస్యలు పరిష్కరించి  ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందేని గుర్తు చేశారు. ఈ  కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఓల్లాల నర్స గౌడ్, మోకు దేబ్బ పట్టణ అధ్యక్షుడు పోడేటి సతీష్ గౌడ్, ఓల్లాల వెంకటేష్ గౌడ్, గొల్లపల్లి రమేష్ గౌడ్, ఎరుకల శంకర్ గౌడ్, ఎరుకల రవి గౌడ్ ,నరేష్ గౌడ్  ఇతర గౌడ నాయకులు పాల్గొన్నారు.