*బడ్జెట్లో వికలాంగుల సంక్షేమంకు నిధులు కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం*

Published: Tuesday February 07, 2023

3016 రూపాయలతో వికలాంగులు బ్రతికేదేట్ల?*

రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరంకు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమం కోసం నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్షం చేసిందని, ఎన్ పి ఆర్ డి  రంగారెడ్డి జిల్లా కమిటీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఖండిస్తూన్నది. 2,90,396 వార్షిక బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు ప్రతిపాదించింది.రెవెన్యూ వ్యయంలో 2016 ఆర్ పి డి   చట్టం ప్రకారం 5 శాతం నిధులు అంటే 10,584.25 కోట్లు కేటాయించాలి. గత సంవత్సరం 89 కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ ఈ బడ్జెట్లో 20 లక్షల మంది ఉన్న వికలాంగుల సంక్షేమం కోసం ఎందుకు నిధులు కెల్టాయించలేదు. ఆటిజoతో 5 లక్షల మంది చిన్నారులు బాధపడుతున్నారు.వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా
కక్లియర్ ఇంప్లాంటేశన్ ఆపరేషన్స్ చేస్తున్నామని చెప్పుతున్నారు. కానీ ఈ బడ్జెట్లో నిధులు మాత్రం కేటాయించలేదు. మానసిక వికలాంగుల సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నరో బడ్జెట్ ప్రసంగంలో ఎందుకు లేదు. 44.12 లక్షల మందికి ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కేవలం 12,000 కోట్లు కేటాయించింది.
ఈ సంవత్సరం మంజూరు చేసిన 8,96,592 పెన్షన్లకు ఈ బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదు.ఆసరా పెన్షన్లు లబ్ధిదారుల సంఖ్య పెంచిన ప్రభుత్వం బడ్జెట్లో నిధులను ఎందుకు ఇవ్వలేదు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు 1,231 కోట్లు మాత్రమే కేటాయించింది. అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించి వికలాంగుల సంక్షేమం కోసం మాత్రం పైసా కేటాయించలేదు. వికలాంగుల వివాహ ప్రోత్సాహకం, స్వయం ఉపాధి రుణాల కోసం, పరికరాల కోసం ఎందుకు నిధులు కేటాయించలేదు. అన్ని శాఖలో ఉద్యోగ నియామకాలు చేస్తున్న ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖలో ఉద్యోగ నియామకాల గురించి బడ్జెట్లో ఎందుకు పెట్టలేదు. పౌష్ఠిక ఆహారం అందించడమే మా లక్ష్యమని చెప్పిన ప్రభుత్వo బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదు. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు, వారి సహాయకులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని 2016 ఆర్ పి డి చట్టంలో ఉన్నప్పటికి ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ 10,000 లకు పెంచేందుకు అవసరమైన నిధులు బడ్జెట్లో కేటాయిపులు పెంచాలని ఎన్ పి ఆర్ డి   డిమాండ్ చేస్తుంది.2016 ఆర్ పి డి  చట్టం అమలు కోసం ఎలాంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అంకెల గారడీ మాటలతో వికలాంగులను మోసం చేయడానికి కంకణం కట్టుకుంది. బడ్జెట్ సవరించి వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలని  ఎంపీ ఆర్ డి,   జిల్లా  కమిటీ డిమాండ్ చేస్తుంది. ఆశన్న గారి భుజంగ రెడ్డి జిల్లా అధ్యక్షులు  జేర్కోని రాజు, జిల్లా కార్యదర్శి   దేవరంపల్లి రాజశేఖర్ గౌడ్, జిల్లా కోశాధికారి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక పాల్గొన్నారు,