సమాజ నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : నాగేంద్ర యాదవ్, వాణిదేవి

Published: Wednesday September 07, 2022
శేరిలింగంపల్లి -ప్రజా పాలన /సెప్టెంబర్  6   :ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేసే బాధ్యత గురువులపై ఉందని, సమాజ నిర్మాణం తమ చేతుల్లోనే ఉందని భావించి ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారని, వారి స్పూర్తి ఇతరులకు ఆదర్శం కావాలని, ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైన వృత్తి అని శాసనమండలి సభ్యులు వాణి దేవి పేర్కొన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి పరిధిలో గల పాపిరెడ్డి కాలనీ, లింగంపల్లి విలేజ్, చందానగర్, ఆరంభ టౌన్షిప్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు వాణి దేవి, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని వాణి దేవి, నాగేందర్ యాదవ్, రాగం అనిరుద్ యాదవ్ లు ఉపాధ్యాయులకు స్ఫూర్తి ప్రదాత డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఆరంభ టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి శాసనమండలి సభ్యులు వాణి దేవి మెమొంటోస్ అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వినాయక స్వామి మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలను వడ్డించినారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు, రాన్స్ ఇన్ఫ్రాకన్సెక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ రాగం అనిరుద్ యాదవ్, రవి యాదవ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, గఫార్, బసవరాజు లింగాయత్, గోపాల్ యాదవ్, శ్రీశైలం, ఎల్లేష్, కృష్ణ, సాయి, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రవీంద్ర రాథోడ్, రాంభూపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు గుప్తా, జనార్ధన్, నరసింహులు, సాయిరాం, మధుసూదన్ రెడ్డి, మహేష్, నరేంద్ర కుమార్, రాజశేఖర్, హర కిషన్, నయీముద్దీన్, అరుణ శ్రీ, విశాలాక్షి, ప్రతిమ, మౌలిక, సుజాత, కనకదుర్గ, అంజలి రుద్ర, తదితర కాలోనివాసులు భక్తులు పాల్గొన్నారు.