నిరుపేద కార్యకర్త దహన క్రియలకు సహృదయుల చేయూత శంకరపట్నం ఏప్రిల్ 18 ప్రజాపాలన :

Published: Wednesday April 19, 2023

శంకరపట్నం మండల కేంద్రం కేశవపట్నం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన  కొయ్యడ రాజయ్య (65) టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాజయ్యకి ఒక కుమారుడు సంతానం  బిల్డింగ్ పెయింటర్ గా, వాచ్ మెన్ గా పనిచేస్తూ, చిన్న గుడిసెను ఏర్పరచుకొని కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంతకాలంగా అనారోగ్యం బారిన పడడంతో చికిత్స కోసం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రి, అక్కడనుండి మెరుగైన వైద్యం కోసం నిమ్స్ కు వెళ్లాలన్న డాక్టర్ల సూచన మేరకు ఆర్థిక స్తోమత లేని రాజయ్య గ్రామంలోని కొందరి ఆర్దిక సాయంతో ఎంజీఎం హాస్పటల్లోనే కొన్ని రోజుల వరకు చికిత్స పొంది తిరిగి ఇంటికే చేరుకున్నాడు. కాగా మంగళవారం ఉదయము తీవ్ర అశ్వస్థతో ఆయన మృతిచెందాడు. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తొలినాళ్లలో ఇతర పార్టీల నాయకులకు బయపడి టిఆర్ఎస్ జెండా పట్టడానికి కూడా బయపడ్డ రోజుల్లో నిరుపేద అయినప్పటికీ  ఎవరికి బయపడకుండా టిఆర్ఎస్ జెండా చేతపట్టి కేశవపట్నంలో జై తెలంగాణ అని నినదించిన సినీయర్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా రాజయ్య పేరుగాంచారు. కాగా నిరుపేద యైన రాజయ్య అంతిమ సంస్కారాలకు  కుటుంబ సభ్యులకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో అతను పార్టీకి చేసిన సేవలను గుర్తించి గ్రామ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ మేకల కుమార్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి 10000, గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ మోత్కూరి సమ్మయ్య 2000, మాజీ ఎంపీటీసీ గుర్రం రామస్వామి 1000 రూపాయలు, ప్రస్తుత ఎంపీటీసీ బొజ్జ కవిత కోటిలింగం వరంగల్లోని ఆసుపత్రి నందు కొంత నగదు, రైతుబంధు సమితి అధ్యక్షుడు కొత్తపెళ్లి రవి, మండలానికి చెందిన వివిధ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా మరికొంత మంది తల కొంత సుమారు 30 వేల రూపాయల మేరకు ఆర్థిక సాయం చేసి దహన క్రియలను నిర్వహించారు. కాగా రాజయ్య కుటుంబ సభ్యులు  నిరుపేదలమైన మమ్మల్ని ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు.