సర్పన్పల్లి గ్రామంలో ఆకస్మికంగా తనిఖీ

Published: Thursday September 09, 2021
జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య
వికారాబాద్ బ్యూరో 8 సెప్టెంబర్ ప్రజాపాలన : పాఠశాలలు పునః ప్రారంభమైన దృష్ట్యా విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించుటకు సర్పన్ పల్లి గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశామని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విస్తరిస్తున్న సమయంలో పిల్లలు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకొనుటకు వచ్చామని పేర్కొన్నారు. విద్యార్థులు మాస్కులు ధరించి శానిటైజర్ చేసుకోవాలని సూచించారు. తరగతి గదుల్లో విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటించాలని హితవు పలికారు. ఉపాధ్యాయులు అన్ని జాగ్రత్తలు పాటించి విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో నాగరాజు, సర్పన్ పల్లి గ్రామ సర్పంచ్ షాకేరా బేగం, వికారాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఫకీరా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.