బెల్లంపల్లి లో మెడికల్ కళాశాల ఏర్పాటుకి సహకరించండి : జెడ్పీ ఛైర్పర్సన్, ఎమ్మెల్యే కు వినతి

Published: Monday June 21, 2021

బెల్లంపల్లి, జూన్ 20 ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ శ్రీమతి కోవ లక్ష్మికి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్పకి బెల్లంపల్లి మెడికల్ కళాశాల సాధన కమిటీ అధ్వర్యంలో ఆదివారం నాడు కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఆదివారం నాడు బెల్లంపల్లి మెడికల్ కళాశాల సాధన కమిటీ ఆధ్వర్యం లో ఆసిఫాబాద్ జెడ్పీ ఛైర్పర్సన్ కోవ లక్ష్మినీ ఆసిఫాబాద్ లో, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నీ సిర్పూర్ లో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి సాధన కమిటీ అధ్వర్యంలో కలిసి వారికి బెల్లంపల్లి మెడికల్ కళాశాల ఏర్పాటు అవశ్యకతను వివరించడం జరిగిందిని. బెల్లంపల్లిలో భూములు, భవనాలు అన్ని అందుబాటులో ఉన్నాయని, బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే పేద గిరిజనులకు విద్యా, వైద్యం అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే ఆసిఫాబాద్ ప్రజలకు అందుబాటులో విద్యా వైద్యం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని వారు సావధానంగా విని దీన్ని ముఖ్యమంత్రి కి, కేటీఆర్ మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని  హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే ఏ, శ్రీదేవి, మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు, బెల్లంపల్లి భాజపా నియోజకవర్గ ఇన్చార్జి కోయ్యాల ఏమాజీ, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్, భాజపా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనిత రాజు లాల్ యాదవ్, తెదేపా జిల్లా ఉపాధ్యక్షులు అమానుల్ల ఖాన్, భాజపా నాయకులు, మరియు వ్యాపార సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.