ఎస్టీ కార్పొరేషన్ లోన్లు కొరకు అభ్యర్థుల ఎంపిక

Published: Thursday September 09, 2021

మధిర, సెప్టెంబర్ 08, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలోని షెడ్యూలు తెగలు -ఎస్టి ట్రైకార్ లోన్స్ 2020- 21 మరియు2021- 22 సంవత్సరాలకు సంబంధించి రుణాల కొరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న ఎస్టీ అభ్యర్థులను టౌన్ సెలక్షన్ కమిటీ వారు అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. ఈ సెలక్షన్ కమిటీలో మున్సిపల్ కమిషనర్, బ్యాంక్ మేనేజర్లు, ఎస్టీ కార్పొరేషన్ల నుండి స్పెషల్ ఆఫీసర్, పట్టణ మహిళా సమైక్య అధ్యక్షురాలు వీరి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత, కమిషనర్ అంబటి రమాదేవి ఎస్ బి ఐ, యు బి ఐ, డి సి సి బి బ్యాంక్ మేనేజర్లు, ఎస్టి కార్పొరేషన్ నుండి స్పెషల్ ఆఫీసర్, మెప్మా మరియు అభ్యర్థులు పాల్గొన్నారు.