రామ్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

Published: Friday April 23, 2021
పరిగి, ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని దొంగ ఎంకేపల్లి గ్రామ పరిధిలో స్థానిక సర్పంచ్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలోయువకులు, గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు టీ.రామ్మోహన్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం 2018లో వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్లో కలుపుటకు నిర్ణయించినప్పుడు అప్పటి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి  దూరదృష్టితో జిల్లాకు భవిష్యత్తులో ఉద్యోగాల్లో, ఉద్యోగ పదోన్నతుల్లో కానీ అన్యాయాలకు గురి కాకుండా ఉండాలంటే జిల్లాను చార్మినార్ జోన్లో చేర్చాలని ఉద్యమము చేపటడడం వల్ల వికారాబాద్ జిల్లా నలుమూలల వ్యాపించింది. టి ఆర్ ఆర్ పరిగి బస్ స్టాండ్ ముందు నిరాహారదీక్ష, చేపట్టడంతో వికారాబాద్ జిల్లా బంద్ పిలుపు మేరకు మేధావులతో చర్చించి చైతన్య పరుచుట, మరియు జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలను సైతం ఒక తాటిపైకి తెచ్చి ప్రభుత్వాన్ని విన్నవించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా కేసీఆర్ వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో చేర్చుతున్నటు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మొన్న వచ్చిన కేంద్ర ప్రభుత్వ గెజిట్ రామ్మోహన్ రెడ్డి కృషి వల్లనే సాధ్యమైంది అని గ్రామస్తులు పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ రాజేందర్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ నాయకులు పులెందర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, సైదులు, మహేందర్ రెడ్డి, గోపి, వెంకన్న, మల్లేష్ మధు, ఆంజనేయులు, నరేష్ సాయిబాబా, చెన్నయ్య, శివనంద్, సంజీవ్ కుమార్ వెంకటేష్, చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.