బావ స్వేచ్ఛకు భంగం కలిగించడం సిగ్గుచేటు ** టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు రహమాన్

Published: Thursday June 23, 2022

ఆసిఫాబాద్ జిల్లా జూన్ 22(ప్రజాపాలన, ప్రతినిధి) : బావ స్వేచ్ఛ కు భంగం కలిగించడం సిగ్గుచేటని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో  జాయింట్ కలెక్టర్ రాజేశం కు వినతి  పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రహమాన్ మాట్లాడుతూ మంచిర్యాల్ మున్సిపల్ పట్టణ ప్రగతి కార్యక్రమానికి సంబంధించి అధికారులు నిర్వహించిన కార్యక్రమం పట్ల ఈనాడు విలేఖరి రాజలింగు రాసిన వార్తా కథనాన్ని నిరసిస్తూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సంబంధిత విలేకరి ఇంటిముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం దారుణం అన్నారు. కార్మికుల విధానాన్ని చూస్తే భావ స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని అన్నారు. పత్రికలలో వచ్చే వార్తల పట్ల అభ్యంతరాలు ఉంటే అనేక మార్గాలలో నిరసన తెలపవచ్చు అని, విలేకర్ల పైన ఉద్దేశపూర్వక మైన దౌర్జన్య సంఘటనలు చేపట్టడం అన్యాయమని ఈ సంఘటన పై తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్ట్ హక్కుల భద్రత చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ప్రకాష్ గౌడ్, దేవునూరి రమేష్, వారణాసి శ్రీనివాస్, మిలిన్, రాందాస్, శ్రీధర్, రాజ్ కుమార్, లు పాల్గొన్నారు.