బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను నెరవేర్చాలి

Published: Tuesday April 06, 2021
బిజెపి జిల్లా ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు పెద్దింటి నవీన్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 05 ( ప్రజా పాలన ) : బాబూజీ గా ఆప్యాయంగా పిలువబడే బాబు జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న జన్మించారని జిల్లా బిజెపి ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు పెద్దింటి నవీన్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో గల బిజేఆర్ కూడలిలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూ అణగారిన వర్గాల గొంతులను తీసుకువచ్చే రాజకీయ నాయకుడు కంటే ఆయన చాలా ఎక్కువ అని గుర్తు చేశారు. స్వయంగా దళిత నాయకుడిగా సామాజిక సంస్కర్తగా ఆయన చేసిన కృషి అనిర్వచనీయం అని కొనియాడారు. భారత రాజ్యాంగంలో ప్రతిష్టాత్మకమైన సామాజిక న్యాయం సూత్రాల యొక్క ప్రాముఖ్యత పై చాలా బలమైన ప్రాధాన్యత ఇచ్చిన కొద్దిమందిలో బాబు జగ్జీవన్ రాం కూడా ఒకరు అని అన్నారు. 1937లో బీహార్ శాసన సభలో సభ్యుడు అయిన తర్వాత గ్రామీణ కార్మికుల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.