ధరణి చిక్కులు తప్పని అన్నదాత గోస* -లక్షల్లో దారఖాస్తులు పట్టించుకోని అధికారులు. -ధరణి పోర్ట

Published: Thursday December 01, 2022

చేవెళ్ల,నవంబర్30,  (ప్రజాపాలన) :-

చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఇచ్చిన పిలుపుమేరకు రైతు పోరు ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఆర్డిఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వసంతం మాట్లాడుతూ రైతులో ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.  ప్రభుత్వం ధరణి పోర్టల్ల్ ను తీసుకొచ్చి లక్షలాది రూపాయలు రెవెన్యూ అధికారుల ద్వారా  వసూలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ధరణి పోటోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోటాలను రద్దు చేయకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్నా కార్యక్రమం కోఆర్డినేటర్ జోష్నా శివారెడ్డి , డిసిసి మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, పీసీసీ కార్యదర్శులు ఉదయ్ మోహన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రామ్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, మధుసూదన్ గుప్తా, డి సి సి ప్రధాన కార్యదర్శి లు యాలాల మహేశ్వర్ రెడ్డి, భార్గవరామ్,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేశామొల్ల  ఆంజనేయులు కోట రాజు గౌడ్, చేవెళ్ల మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, శంకర్ పల్లి మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, మొయినాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు మానేయ, షాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్, చేవెళ్ల సొసైటీ చైర్మన్ దేవర వెంకటరెడ్డి, ముడిమేల సొసైటీ చైర్మన్ ప్రతాపరెడ్డి, మొయినాబాద్ సొసైటీ చైర్మన్ చంద్రారెడ్డి, ఓబీసీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఎన్ ఎస్ యు ఐ చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడు మధు, యూత్ కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడు పెంటారెడ్డి, మైనారిటీ సెల్ చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడు శమియుదిన్ , చేవెళ్ల మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవర సమతా వెంకట్ రెడ్డి, షాబాద్ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అశ్విని,ఎంపిటిసి సభ్యులు సురంగల్ రామ్ రెడ్డి, అందాపూర్ ఎంపిటిసి సామ రవీందర్ రెడ్డి, మహేందర్ ముదిరాజ్, మండల పార్టీ నాయకులు ఇబ్రహీం పల్లి మల్లేష్ ,సత్యనారాయణ, మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి హనీఫ్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బి శ్రీనివాస్, ఉరెళ్ళ దేవేందర్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు చాంద్ పాషా, మండల పార్టీ కార్యదర్శి ఖదీర్, పోతుగల్ రవీందర్ నాయక్, కొండకల్ జాంగిర్ తదితరులు పాల్గొన్నారు.