శంకరపట్నం లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్ర

Published: Saturday December 17, 2022

శంకరపట్నం డిసెంబర్ 16 ప్రజాపాలన రిపోర్టర్:

  బిఎస్పి స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర 145వ రోజు శుక్రవారం శంకరపట్నం  మండలంలోని పలు గ్రామాల్లో ఈ యాత్ర సాగింది. యాత్రలో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాడికల్ గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో సందర్శించి వారి సమస్యలు తెలుసుకుని వారి పిల్లలను వివిధ కారణాలతో పనులకు పంపించకుండా వారిని పాఠశాలలకు పంపించి ఉన్నత చదువులు చదివించి అభివృద్ధిలోకి తీసుకురావాలని వారికి సూచించారు చదువే అన్నింటికన్నా ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
అనంతరం మక్త గ్రామంలో బి ఎస్ పి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేశవపట్నం గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కెసిఆర్ రైతుబంధు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని పక్కనే ఉన్న గ్రామంలో వందల ఎకరాలు  కలిగిన భూస్వాములకు లక్షల్లో రైతుబంధు  వస్తుందని ఆ గ్రామంలోని మిగతా రైతులందరి కలిపిన అంత పెద్ద మొత్తంలో రైతుబంధు రాదని, రైతుబంధు ఉన్నత వర్గాలకు మేలు చేసేదిగా ఉందని చిన్న  సన్నకారు రైతులకు కౌలు రైతులకు ఏమాత్రం లబ్ధి చేకూరడం లేదని ఆయన అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. అనంతరం  శంకరపట్నం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో  బీఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.