బిజెపి నాయకుల అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం* - బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్

Published: Wednesday August 24, 2022

మంచిర్యాల టౌన్, ఆగష్టు 23, ప్రజాపాలన: బిజెపి నాయకుల అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం సోమవారం రోజున టిఆర్ఎస్ నాయకులు బిజెపి కార్యకర్తల పై దాడి చేయడాన్ని ఖండిస్తూ మంగళవారం రోజు జిల్లా వ్యాప్తంగా బిజెపి నిరసన కార్యక్రమాలకు పిలుపును ఇస్తే నిరసనలు చేపట్టకుండా పోలీసులు బిజెపి కార్యకర్తల ఇండ్లల్లకు వెళ్ళి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం సిగ్గు చేటు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా దీక్ష చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని  మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలపెట్టిన బిజెపి నాయకులకు, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నపటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ప్రతిపక్షాల గొంతు నొక్కడం హేయమైన చర్యగా భావిస్తున్నాం అని అన్నారు.మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చేసిన బిజెపి నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.