రైతులకు అండగా కెసిఆర్ ప్రభుత్వం --ఎమ్మేల్యే డా.సంజయ్

Published: Monday September 12, 2022

జగిత్యాల, సెప్టెంబర్, 11 ( ప్రజాపాలన ప్రతినిధి): రైతులకు అండగా కెసిఆర్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన యువరైతు గడ్డం నిరంజన్ రెడ్డి గుండెపోటుతో ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను  ఎమ్మెల్యే పరామర్శించినారు. అనంతరం  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే ముఖ్యమంత్రి  రైతును రాజు చేసే దిశగా వ్యవసాయ రంగంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతుబంధు, రైతు ఏ కారణం చేతనైనా మరణిస్తే రైతు కుటుంబానికి 5 లక్షలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. ఏలాంటి పైరవీలు లేకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే రైతు కుటుంబానికి 5 లక్షల డబ్బులు వారి ఖాతాలో జమ అవుతున్నాయని అన్నారు. రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈగొప్ప కార్యక్రమం చేపట్టారని అన్నారు. రైతు సంక్షేమ కార్యక్రమాలు నేడు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులుబాలముకుందం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దశరథ రెడ్డి, సర్పంచ్ జైపాల్ రెడ్డి, ఎంపిటిసి సురేందర్ రెడ్డి, రైతు బందు సమితి సభ్యులు రాజేశ్వర్ రెడ్డి, నాయకులు రమణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కృష్ణ, గంగాధర్, సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, గాదె శ్రీనివాస్, అనంతారం ఉప సర్పంచ్ మహేష్, నాగరాజు, తదితరులు ఉన్నారు.