ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన యునిసెఫ్ బృందం

Published: Friday July 15, 2022

బోనకల్, జులై 15 ప్రజాపాలన ప్రతినిధి: మాతా శిశు సంరక్షణ కార్యక్రమంను పరిశీలించుటకై హైదరాబాదు నుండి యునిసెఫ్ ప్రతినిధుల బృందం గురువారం బోనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించినారు. ఆరోగ్య కేంద్రం నందు 60 మంది గర్భిణీ స్త్రీలను, 20 మంది బాలింతలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి అందుతున్న సేవలు, సౌకర్యాలు, వసతులు, సిబ్బంది పనితీరు, ఇతరతర సేవలను అడిగి తెలుసుకున్నారు. వారి నుండి సేకరించిన వివరాలను యునిసెఫ్ ప్రతినిధులు నమోదు చేసుకున్నారు. గర్భిణీ స్త్రీలు బాలింతలు సంతృప్తికర సమాధానాలు ఇచ్చినందున, దీనికి వారు సంతృప్తి వ్యక్తపరిచినారు. వైద్యాధికారులను, సిబ్బందిని బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో యునిసెఫ్ సభ్యుల బృందం డాక్టర్ విక్రమ్, శివ, బోనకల్ వైద్యాధికారులు డాక్టర్ శ్రీకాంత్, ఎన్ బాలకృష్ణ, ప్రశాంత్, సిహెచ్ఓ శ్రీనివాసరావు, స్టాఫ్ నర్స్ కే భవాని, సూపర్వైజర్స్ టి స్వర్ణమాత, పి రాజ్యలక్ష్మి, ఫార్మసిస్ట్ ఎం రాధా లతా, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.